top of page

Railway News

 

ఎంపీల సొంత నిర్ణయాలు ఇక సాగవు

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 27: జీత భత్యాల విషయంలో ఇకపై ఎంపీల సొంత నిర్ణయాలు సాగవు. తమ ఇష్టానుసారం వీటిని పెంచుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 106, 1954 నాటి చట్టం ప్రకారం ఎంపీలు తమ జీత భత్యాలను సవరణల ద్వారా ఎప్పటికప్పుడు నిర్ణయించుకునే వీలుంది. ఇలా ఇప్పటి వరకు పలు సార్లు వాటిని పెంచుకున్నారు. 2010లో ఎంపీల జీత భత్యాలను ఏకంగా మూడు రెట్లు పెంచే బిల్లును ఉభయ సభలు ఆమోదించాయి. అప్పటి వరకు నెలకు 16 వేలు ఉన్న సభ్యుల జీతం ఒక్కసారిగా 50 వేలకు పెరిగింది. అంతేగాక సభలు, హోస్ కమిటీ సమాశాలకు హాజరయ్యే వారికి రోజుకు రెండు వేలు చొప్పున భత్యం చెల్లిస్తారు. అలాగే ప్రతి ఎంపీకి నియోజకవర్గానికి 45 వేల చొప్పున ప్రతి నెల కేటాయిస్తారు. స్టేషనరీ కోసం 15 వేలు, వ్యక్తిగత సహాయకుల నియామకం కోసం మరో 30 వేలు కూడా అందుకుంటారు. వారి వసతి, విమాన, రైలు ప్రమాణంతో పాటు ఫోను ఖర్చులను కేంద్రమే భరిస్తుంది. అంతేగాక వాహనం కొనుగోలుకు 4 లక్షల రుణం కూడా లభిస్తుంది. ఇలా ప్రతి ఎంపీకి నెలకు లక్షల్లో జీత భత్యాలు అందుతున్నాయి. దీనిపై ప్రజలతో పాటు అన్ని వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై సమీక్ష జరపాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. మరోవైపు ఇటీవల బీజేపీ ఎంపీ జోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఇంటర్ పార్లమెంటరీ ప్యానెల్.. ఎంపీలకు వంద శాతం జీతాల పెంపుతోపాటు భారీగా భత్యాలు పెంచాలని ప్రతిపాదించింది. అయితే ప్రజల నుంచి మరింత విమర్శలు వస్తాయని భావించిన ఎన్డీయే ప్రభుత్వం వాటిని పక్కన పెట్టింది. జెనివా కేంద్రంగా ఇంటర్ పార్లమెంటరీ సంఘం నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 104 పార్లమెంట్లలో సగం చట్ట సభలు తమ సభ్యుల జీత భత్యాలను తామే నిర్ణయించుకుంటున్నాయి. మిగతా 50 శాతం దేశాల్లో ప్రభుత్వం లేదా ఆ దేశాధినేత వీటిని ఖరారు చేస్తారు. ఈ నివేదికతో కేంద్రం పునరాలోచనలో పడింది. ఎంపీల జీత భత్యాల కోసం ఓ స్వతంత్ర కమిటీ ఏర్పాటు చేయాలని భావిస్తోంది. ముగ్గురు సభ్యుల పే కమిషన్‌ను ఏర్పాటు చేయాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. వచ్చే వారం విశాఖలో జరగనున్న రెండు రోజుల అఖిల భారత విప్‌ల సమావేశంలో దీనిపై చర్చించనున్నారు.

 

రైల్వే రిటైరింగ్ రూంలకూ ఆన్లైన్ బుకింగ్!

న్యూఢిల్లీ : ఇన్నాళ్లూ రైలు టికెట్లు మాత్రమే ఆన్లైన్లో బుక్ చేసుకునే అవకాశం ఉండేది. ఇక మీదట రైల్వే స్టేషన్లలో ఉండే రిటైరింగ్ రూంలను కూడా ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. ప్రయాణికులకు మరిన్ని సౌకర్యాలు కల్పించే కృషిలో భాగంగా ఐఆర్సీటీసీ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తోంది. టికెట్ కన్ఫర్మ్ అయినా లేదా ఆర్ఏసీలో ఉన్నా సరే.. రిటైరింగ్ రూంను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. కౌంటర్లలో తీసుకున్నా లేదా ఈ టికెట్ తీసుకున్నా కూడా ఈ సదుపాయం ఉంటుంది.ప్రస్తుతానికి కేవలం ముంబైలోని సీఎస్టీ స్టేషన్లో ఉన్న రిటైరింగ్ రూంలకు మాత్రమే ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చారు. క్రమంగా ఢిల్లీ, కోల్కతా లాంటి నగరాలతో పాటు దేశంలోని ముఖ్యమైన పర్యాటక ప్రాంతాలన్నింటికీ ఈ సదుపాయాన్ని త్వరలోనే విస్తరిస్తారు. నేరుగా ఐఆర్సీటీసీ సైట్ నుంచి లేదా రైల్టూరిజంఇండియా.కామ్ అనే సైట్ నుంచి వీటిని బుక్ చేసుకోవచ్చు. రాత్రి 11.30 నుంచి 12.30 మధ్య మినహా రోజులో 23 గంటలూ రిటైరింగ్ రూంలను బుక్ చేసుకునే అవకాశం ఉంది. సింగిల్ బెడ్ లేదా డబుల్ బెడ్ ఉన్న రిటైరింగ్ రూంలు.. లేదా చివరకు డార్మిటరీలో ఒక బెడ్ను కూడా బుక్ చేసుకోవచ్చు. కనిష్ఠంగా 12 గంటలు, గరిష్ఠంగా 48 గంటలకు బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది.

ముంబై: పది రోజుల వ్యవధిలో మళ్లీ అదే ఘోరం. రైల్వే భద్రత గాల్లో దీపం చందమన్నట్లుగా మంటల్లో మరో రైలు కాలిపోయింది. 9 మంది ప్రయాణికులను బుగ్గి చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో డిసెంబర్ 28న బెంగళూరు-నాందేడ్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు చెలరేగి 26 మంది సజీవదహనమైన దుర్ఘటన మరవకముందే మరోసారి అదే తరహా ప్రమాదం జరిగింది.
   మహారాష్ట్రలోని థానే జిల్లాలో ఉన్న డహాన్ వద్ద మంగళవారం అర్ధరాత్రి సుమారు 2.50 గంటలకు బాంద్రా నుంచి డెహ్రాడూన్ వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 9 మంది ప్రయాణికులు సజీవదహనమవగా మరో ఐదుగురు గాయపడ్డారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాలు... రైలు ముంబైకి సుమారు 140 కి.మీ. దూరంలో ఉన్న థానే జిల్లా డ హాన్ తాలూకా వద్దకు చేరుకోగానే ఎస్-2, ఎస్-3 బోగీల మధ్య వెస్టిబ్యూల్ (లింకు)లో మంటలు ఒక్కసారిగా అంటుకున్నాయి. ఆపై ఎస్-4 బోగీకి వ్యాపించాయి.
 

చెన్నై ఎక్స్ప్రెస్లో భారీగా వెండి స్వాధీనం
మరో రైలు బుగ్గి

గూడూరు : నెల్లూరు జిల్లా గూడూరు రైల్వే స్టేషన్లో చెన్నై - హౌరా ఎక్స్ప్రెస్లో ఆదివారం పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఓ వ్యక్తి నుంచి 70 కిలోల వెండితోపాటు, 50 కిలోల రంగురాళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకుని, గూడూరు పోలీస్ స్టేషన్కు తరలించారు. అంత మొత్తంలో వెండి, రంగురాళ్లను అనధికారికంగా తరలింపుపై పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు.

bottom of page